శ్రీ సత్యనారాయణుని పూజకు రారే
కన్నులారా స్వామిని చూసి హారతులివ్వరే

శ్రీ సత్యనారాయణుని పూజకు రారే
కన్నులారా స్వామిని చూసి హారతులివ్వరే

శ్రీ సత్యనారాయణుని పూజకు రారే

ఏ ఇంట స్వామి వ్రతము తప్పక జరుగునో
ఏ ఇంట స్వామి వ్రతము తప్పక జరుగునో
ఆ ఇంట శ్రీలక్ష్మి స్థిరముగ వుండునో
సకల ఐశ్వర్యములు సకల సంపదలూ
వారికి కలుగును భోగ భాగ్యములూ

శ్రీ సత్యనారాయణుని పూజకు రారే
కన్నులారా స్వామిని చూసి హారతులివ్వరే
శ్రీ సత్యనారాయణుని పూజకు రారే

దేవాది దేవుని వైకుంట నాథుని
దేవాది దేవుని వైకుంట నాథుని
విభవములు కలిగించు విష్నుదేవుని
భక్తితో ధ్యానించి పూజించినంతనే
సత్యదేవుని కృపకు పాత్రులయ్యెదరూ

శ్రీ సత్యనారాయణుని పూజకు రారే
కన్నులారా స్వామిని చూసి హారతులివ్వరే
శ్రీ సత్యనారాయణుని పూజకు రారే
కన్నులారా స్వామిని చూసి హారతులివ్వరే
శ్రీ సత్యనారాయణుని పూజకు రారే

దేవుళ్ళు - సిరులనొసగి సుఖశాంతులు

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ
పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

షిర్డీ గ్రామంలో ఒక బాలుని రూపంలో
వేప చెట్టు కిందా వేదాంతిగ కనిపించాడు
తన వెలుగును ప్రసరించాడు
పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం
పగలు రేయి ధ్యానం, పరమాత్మునిలో లీనం
ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురు పీఠం
ఎండకు వానకు కొండకూ ఈ చెట్టు నీడనే వుండకూ
సాయి యి యి సాయి యి యి
సాయిరాం మసీదుకి రా అని మహల్సాపతి పిలుపుకు
మసీదుకి మారెను సాయి అదే అయినది ద్వారకమాయి
అక్కడ అందరు భాయి భాయి బాబా బోధల నిలయమదోయి

సిరులనొసగి సుఖశాంతులు కూర్చును షిర్డీ సాయి కథ
మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా

ఖురాను బైబిలు గీతా ఒకటని కులమ బేధం వద్దనీ
గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే
రాతి గుండెలను గుడులని చేసే నీటి దీపముల వెలిగించే
పచ్చి కుండలో నీటిని తెచ్చి పూల మొక్కలకు పోసి
దిండీ వనముని పెంచీ మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించే
కప్పకు పాముకు స్నేహం కలిపే బల్లి భాషకు అర్థం తెలిపే

ఆర్థుల రోగాలను హరియించే భక్తుల భాధలు తాను భరించే
ప్రేమ సహనం రెండు వైపులా వున్ననాడె గురుదక్షిణ అడిగే
మరణం జీవికి మార్పుని తెలిపే మరణించీ తాను మరలా బ్రతికే
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం

నీదని నాదని అనుకోవద్దని, ధునిలో ఊదిని భూతిగనిచ్చే
భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఊత్సవమై సాగగా
కంకణ హారతులందుకొని కలి పాపాలను కడుగగా
సకల దేవతా స్వరూపుడై, వేద శాస్త్రములకతీతుడై 
సద్గురువై జగద్గురువై

సత్యం చాటె దత్తాత్రేయుడవై భక్తుని ప్రాణం రక్షించుటకై
జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి త్రుటిలోన పగులగా 
ఆ ఆ ఆ ఆ
పరిపూర్ణుడై గురుపూర్ణిమై
భక్తుల మనసున చిరంజీవివై
శరీర సీమోల్లంఘణ చేసి దేహము విడిచెను సాయి 

ఆ ఆ సమాధి అయ్యెను సాయి
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం
సాయిరాం సాయిరాం

అఖిలాండకోటి బ్రహ్మండనాయక
శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

దేవుళ్ళు - వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవా ఆ
సర్వ కార్యేషు సర్వదా ఆ ఆ

జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
ఆ ఆ ఆ ఆ ఆ

బాహుదానదీ తీరంలోనా బావిలోన వెలసిన దేవా
మహిలో జనులకు మహిమలు చాటి ఇహపరములనిడు మహానుభావా
ఇష్టమైనదీ వదిలిన నీ కడ ఇష్టకామ్యములు తీర్చె గణపతి
కరుణను కురియుచు వరములనొసగుచు నిరతము పెరిగే మహాకృతి
సకల చరాచర ప్రపంచమే సన్నులు చేసె విఘ్నపతి
నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ దేవతకు నిలుపును ప్రాణం
విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం

జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక

పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మండ నాయకుడివైనావు
మాతా పితలకు ప్రదక్షిణముతో మహా గణపతిగ మారావు
భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు

లాభము శుభము కీర్తిని గూర్ప లక్ష్మీ గణపతివైనావు
వేద పురాణములకిల శాస్త్రములు  కడలూ చాటును నీ వైభవం
వక్రతుండమే ఓంకారమని విభుతులు చేసే నీ కీర్తనం

జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

హే పాండురంగ, పండరినాథ

హే పాండురంగ, పండరినాథ
శరణం శరణం శరణం

బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె

విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విగ్ణేశ్వరుదై
పిల్లా పాపలు కోరిన వారిని కరుణించాడు సర్వేస్వరుడై

తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై

మగశ శ్యామకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడిగా
యద్భావం తద్భవతని దర్షనమిచ్చాడు ధన్యుల చెశాడు

బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె

పెను తుపాను తాకిడిలో అలమటించు దీనులను
ఆదరించె సాయినాధ నాధు
డై

అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యు

వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకొని మోక్షమిచ్చె పూజ్యుడై

పుచ్చుకున్న పాపములను ప్రక్షాలణ చెసికొనెను
దౌత్య క్రియ సిద్దితో శుద్దుడై

అంగములను వేరుచెసి ఖండయోగ సాధనలొ
అత్మశక్తి చాటెను సిద్దుడై

జీవరాశులన్నిటికి సాయే శరణం సాయే శరణం
దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం సాయే శరణం

ఆస్తికులకు సాయే శరణం
నాస్తికులకు సాయే శరణం

భక్తికి సాయే శరణం
ముక్తికి సాయే శరణం

బాబా శరణం సాయి శరణు శరణం
బాబా చరణం గంగ యమున సంగమ సమానం

ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె

బాబా, సాయి బాబా

బాబా, సాయి బాబ
బాబా, సాయి బాబా

నీవూ మావలె మనిషివని
నీకూ మరణం వున్నదని

అంటే, ఎలా నమ్మేది
అనుకొనీ, ఎలా బ్రతికేది

బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా

నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు "2"
నువ్వే దేవుడివైతే, ఆ మృత్యువెలా శాసిస్తాడు

తిరుగాడె కోవెల నీదేహం
చిరిగినంతనే శిథిలం అవుతుందా

పిలిచినంతనే పలికే దైవం మూగై పోతాడా

బాబా, సాయి బాబా
బాబా, సాయి బాబా "నీవు మావలె"

దివిలో వున్నా భువిలొ వుండె మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ వున్న ముక్కలు చెక్కలు చేసుకురా "2"

సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళల్ ఇహ పర శక్తులు గగ్గోలెత్తగా రావయ్యా

నువు లేకుంటె నువు రాకుంటె ఎందుకు మాకు ఈ లోకం "2"

లయం వచ్చి ప్రపంచం అంతా నాశనం ఐపొనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం ఐపొనీ

కదిలే జ్వాలాగ్ని ఎగసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేది

నేనే ఆత్మైతే నీవే పరమాత్మ
నీలొ నన్ను ఐక్యం ఐపొనీ, పొన

అల్లా సాయి

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

శ్రీ గురుదత్త స్వరూప సాయి
శ్రీ పండరి విఠలేశ సాయి "2"
సర్వాభిష్ట ప్రధాయక సాయి
సాధు పురుష పరిపాలక సాయి "2"

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

అణువణువున దాగిన శ్రీ సాయి
అంతరాళమున నిలిచిన సాయి "2"
అండపిండ బ్రహ్మాండము సాయి
అంతర్హితుడై వెలిసిన సాయి "2"

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

త్రిగుణాతీతుడు దైవం సాయి
తిలోకవంద్యి దు దేవుడు సాయి "2"
పంచభూత నిక్షిప్తుడు సాయి
పతితపావనుడు ఫకీరు సాయి "2"

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

వాణి లక్ష్మీ పార్వతి సాయి
వాసవాది సన్నుత శ్రీ సాయి "2"
గౌరీ చండీ దుర్గా సాయి
శాంభవి కాళి శాంకరీ సాయి

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

వేంకటేశ వేదాత్మక సాయి
సంకతనాశ సద్గురు సాయి "2"
మురలీధర రమాభవ సాయి
ముకుంద కేశవ శౌరీ సాయి "2"

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

హిందూ ముస్లిం క్రైస్తవ సాయి
గీత ఖురాను బైబిలు సాయి "2"
ఆత్మదర్శణం చేసిన సాయి
అఖిలమునే ప్రేమించిన సాయి "2"

అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2"

ఎంతెంత దయనీది ఓ సాయి

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ఎంతెంత దయనీది ఓ సాయి "2"

తొలగించినావు వ్యాధులు ఊదితో
వెలిగించినావు దివ్వెలు నీటితో "2"
నుడులకు అందవు నుతులకు పొంగవు "2"
పాపాలు కడిగేసె పావన గంగవు

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

భక్త కభీరే నీ మతమన్నావు
భగవానుడే నీ కులమన్నావు "2"
అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ.."2"
అందరిలో నేవే కొలువున్నావు

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ప్రభవించినావు మానవ మూర్తివై
ప్రసరించినావు ఆరని జ్యోతివై "2"
మారుతి నీవే గణపతి నీవే "2"
సర్వదేవతల నవ్యాకృతి నీవే

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
నిను ఏమని పొగడను సర్వాంతర్యామి

ఎంతెంత దయనీది ఓ సాయి "2"
బాబా సాయి బాబా
బాబా మా సాయి బాబా
బాబా బాబా షిరిడి బాబా

నువులేక అనాథలం

సాయిబాబా సాయిబాబా
సాయినాథ సాయిదేవా
సత్యం నిత్యం నేవే కావా
నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం "2"

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

మా పాలి దైవం అని
మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి

మా ఆర్థి చూస్తావని
సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి

శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా
ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి

రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

మా యేసు నీవేనని మా ప్రభువు నీవేనని
ప్రార్థనలు చేసామయ్య నిన్నే
అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేసాము సలాం సలాం నీకే
గురునానక్ అయినా గురుగోవిందు అయినా
గురుద్వారమయిన నీద్వారకేనని
నీ భక్తులయినాము సాయి

రావా బాబా రావా రక్షా రక్షా నీవే కదా మా బాబా

నువులేక అనాథలం
భ్రతుకంతా అయోమయం

బాబా ఓ బాబా

ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము

క్రిష్ణ క్రిష్ణ రామ సాయి "2"
అల్లా సాయి మౌలా సాయి నానక్ సాయి గోవిందు సాయి యేసు సాయి షిర్డీ సాయి"2"
సాయి సాయి బాబా సాయి "4"
ఓం

మా పాపాల తొలగించు

మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య
మమ్ము కరుణించినావయ్య
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య
మేము తరియించినామయ్య "మా పాపాల"

పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని
వాడు పరిశుద్దుడవుతాడని
గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి
మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి
నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి
తలపుల్ని తీసేస్తివి, మా కలతలని మాపేస్తివి "మా పాపాల"

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం
ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాదుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్య
వారి బాదల్ని మోసావయ్య
ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో
నువ్వెంత వాడైతివో నువ్వు ఏనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నివాసమాయే ధన్యులమయినామయ్య
మాకు దైవామైవెలిసావయ్య "మా పాపాల"

హనుమాన్ చాలీసా

దోహా

శ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధార్
బరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచార

బుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార
బలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార

1.జయహనుమాన జ్ఞాన గుణసాగర
జయకపీశ తిహులోక ఉజాగర

2.రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవన సుతనామ

3.మహావీర విక్రమ బజరంగీ
కుమతినివార సుమతికే సంగీ

4.కంచన వరణ విరాజసువేశ
కానన కుండల కుంచిత కెశా

5.హాథ వజ్ర ఔద్వజా విరాజై
కాంథే మూంజ జనేవూ సాజై

6.శంకర సువన కేసరి నందన
తేజ ప్రతాప మహాజగ వందన

7.విద్యావాన గుణి అతిచాతుర
రామకాజ కరివేకో ఆతుర

8.ప్రభుచరిత్ర సునివేకో రసియా
రామలఖన సీత మన బసియా

9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ
వికటరూప ధరి లంక జరావ

10.భీమరూప ధరి అసుర సమ్హారే
రామ చంద్రకే కాజ సవారే

11.లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి వురలాయే

12.రఘుపతి కీన్హీ బహుత బడాయి
తుమ మమ ప్రియ భరత హి సమభాయి

13.సహస వదన తుమ్హరో యశగావై
అసకహి శ్రీపతి కంఠలగావై

14.సనకాదిక బ్రహ్మాది మునీశా
నారద శారద సహిత అహీశా

15.యమ కుభేర దిగపాల జహాతే
కవికోవిద కహి సకై కహాతే

16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా

17.తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగజానా

18.యుగ సహస్ర యోజన పరభానూ
లీల్యో తాహి మధుర ఫల జానూ

19.ప్రభుముద్రికా మేలిముఖ మహీ
జలధి లాంఘిగయే అచరజ నాహీ

20.దుర్గమ కాజ జగతకే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

21.రామ దు ఆరే తమ రఖవారే
హోతన ఆజ్ఞా బిను పైసారే

22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా
తుమ రక్షక కాహూ కో డరనా

23.ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోం లోక హాంకతే కాంపై

24.భూత పిశాచ నికట నహి ఆవై
మహావీర జబనామ సునావై

25.నాశై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత బలవీరా

26.సంకట సే హనుమాన చుడావై
మన క్రమ బచన ద్యాన జోలావై

27.సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా

28.ఔర మనోరథ జోకో ఇలావై
నోయి అమిత జీవన ఫల పావై

29.చారో యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా

30.సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామ దులారే

31.అష్ట సిద్ది నవనిధి కే దాతా
అస వర దీన జానకీ మాతా

32.రామ రసాయన తుమ్హరే పాసా
సదా రహో రఘుపతికే దాసా

33.తుమ్హరే భజన రామకో పావై
జన్మ జన్మకే దుఖ బిసరావై

34.అంతకాల రఘుపతి పురజాయీ
జహా జన్మ హరిబక్త కహాయీ

35.ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయు సర్వ సుఖ కరయీ

36.సంకట హరై మిటై సబవీరా
జో సుమిరై హనుమత బలవీరా

37.జైజైజై హనుమాన గోసాయీ
కృపాకరో గురుదేవకీనాయీ

38.జోహ శతబార పాఠకర జోయీ
చూటహి బంది మహా సుఖ హోయీ

39.జో యహ పడై హనుమాన చాలీసా
హోయసిద్ది సాఖీ గౌరీసా

40.తులసీదాస సదా హరిచేరా
కీజైనాథ హృదయ మహడేరా

దోహ

పవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప
రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప

ఎంత మధురమో

ఎంత మధురమో శ్రీ సాయి నామము "2"
శుభముల లబ్దికి, సంకల్ప సిద్దికి "2"
శిరిడీ నాధు స్మరణమే
ఎంతో మధురము "ఎంత"

జీవాత్మ పరమాత్మల మేలవింపులో
మహిలో మెలిగే మహనీయుడు "2"
బక్తి తత్వములను ప్రభోదించిన
సద్గురుల నులి చరితం ఎంత మధురమో "ఎంత"

మనసులోన మెదిలే భక్తి శ్రద్దలే
మనుగడను తీర్చే మణిదీపాలై "2"
వెలుగు బాటలో మము నడిపించే
సద్గురుల ధుని ఉదయం ఎంత మధురమో "ఎంత"