శ్రీ రామదాసు - ఎంతో రుచిరా

రామ, శ్రీరామ, కోదండరామ
ఎంతో రుచిరా,ఆ, ఎంతో రుచిరా ఆ
శ్రీరామ ఓరామ, శ్రీరామా ఆ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

కదలి ఖర్జూరాది ఫలములకన్ననూ "2"
పతిత పావన నామమేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవరస పరమాన్న నవనీతములకన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ ఓరామ, శ్రీరామా ఆ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామమేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఆలయ భధ్రాచల శ్రీ రామదాసుని
ఏలిన నీ నామమేమి రుచిరా

శ్రీరామ ఓరామ, శ్రీరామా ఆ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

గాయం - అలుపన్నది ఉందా

అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది మలుపులకు
ల ల ల ల లల లలల  "అలుపన్నది --- వరకు"

నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నాసేవకై సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లల లలల  "అలుపన్నది --- వరకు"

నీ చూపులే తడిసే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తేరిసే ఈ తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లల లలల 

అలుపన్నది ఉందా ఎగిరే అలకు, ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు, కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది మలుపులకు
ఊహు ఊహు ఊహు ఊహూ

మగధీర - పంచదారా బొమ్మా బొమ్మా

పంచదారా బొమ్మా బొమ్మా, పట్టుకోవద్దనకమ్మా
మంచుపూల కొమ్మా కొమ్మా, ముట్టుకోవద్దనకమ్మా
చేతినే తాకొద్దంటే, చెంతకే రావద్దంటే
ఏమౌతానమ్మా ఆ ఆ ఆ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ

పువ్వు పైన చేయేస్తే కసిరి నన్ను తిట్టిందే
పసిడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నావెంట, ఈ పువ్వు చుట్టు ముళ్లంట
అంటుకుంటె మంటే ఒళ్ళంతా
తీగ పైన చేయేస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట
ఈ వరదలాగ మారితే ముప్పంట
వరదైనా వరమని భరిస్తానమ్మా
మునకైనా సుఖమని ముడెస్తానమ్మా ఆ ఆ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ

గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరయ్యింది నేల నన్ను నడిపింది
ఏమిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది చినుకు కూడ తాకింది
పక్షపాతం ఎందుకు నాపైనా
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది
వాటితోటి పోలిక నీకేలా
అవి బ్రతికున్నప్పుడె తోడుంటాయమ్మా
నీ చితిలో తోడై నేనొస్తానమ్మా

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ

Dalapathi - Sundari Nene Nuvvanta

సుందరీ నేనే నువ్వంట, చూడనీ నీలో నన్నంత
కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా, నీడగా పాడమంటా
నా సిరి నువ్వేనట

సుందరీ నేనే నువ్వంట, చూడనీ నీలో నన్నంత
కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట

అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
ఆ ఆ రేపవలు నిద్దురలోను ఎద నీతోడే కోరును
యుద్ధన్న ఏమైన నా ఆత్మే నిన్ను చేరును
ఎద పిలుపు ఈ వేళ, ఏల ఈ శొధనా
జాబిలిని నూవడుగు, తెలుపు నా వేదనా
నాలో ప్రేమే మరిచావు, ప్రేమే నన్నే గెలిచేనే

కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట
సుందరీ నేనే నువ్వంట, చూడనీ నీలో నన్నంత
గుండెలో నిండమంటా, నీడగా పాడమంటా
నా సిరి నువ్వేనట

సుందరీ నేనే నువ్వంట, చూడనీ నీలో నన్నంత
కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట

పూవులే ముళ్ళై తోచు నీవే నన్నే వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎదమాటున చేరితే
ఆ మాసాలు వారాలవును నీవు నేను కూడితే
ఆ వారాలు మాసాలవును మాటె వీడి సాగితే
పొంగునే బంధాలె నీ దరే చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట వుంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కాదా నా లోకం

సుందరీ నేనే నువ్వంట, చూడనీ నీలో నన్నంత
కానుకే ఇచ్చా మనసంతా, జన్మకే తోడై నేనుంట

గుండెలో నిండమంటా, నీడగా పాడమంటా
నా సిరి నువ్వేనట

భైరవ ద్వీపం - విరిసినదీ వసంత గానం

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆఅ ఆ హ హ ఆ
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా "2"
మనసే మందారమై, వయసే మకరందమై
అదేదో మాయ చేసినదీ
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం, రతి వేదం
జత కోరే భ్రమర రాగము
రమ్మంది మోహం, ఒక దాహాం
మరులూరే భ్రమల మైకమూ
పరువాల వాగిదీ ప్రవహించే ఈవని
ప్రభవించే ఆమని, పులకించే కామిని
వసంతుడె చెలికాంతుడై దరిచేరె మెల్లెగా

విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో విరి తేనే జడివానై కురియగా
లతలు పెనవేయా, మైమరచీ మురిసేను తనువు హాయిగా
రాచిలుక పాడగా, రాయంస ఆడగా
రసలీల పాడుతా, తనువెల్ల ఊగగా
ఆరుడె సుకుమారుడై జతకూడే మాయగా

విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
మనసే మందారమై, వయసే మకరందమై
అదేదో మాయ చేసినదీ
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా

Athadu - పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి

ఆ ఆ ఆ ఆ హ ఆ హ
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి, నల్ల మబ్బు ఉరిమేనా-- "2"

కళ్ళెర్ర చేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగీ, జల్లుమంటూ ఉరికీ
మా కళ్లలో వాకిల్లలో వేవేల వర్ణాలా వయ్యారి జానా
అందమైన సిరి వానా, ముచ్చటగా మెరిసే సమయానా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

మౌనాలా వెనకాలా, వైనాలే తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటు గుండెలోనా, తుంటరిగా తుల్లుతున్న థిళ్లానా -- "2"

ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించనా
చంద్రజాలమై తారంగాల ఓడిలో ఏళ్లన్ని మురిపించగా
తారలన్నీ తోరణాలై వరానా ముత్యాల హారలయ్యేనా
చందనాలు చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

నవ్వుల్లో హయి రాగం, మువ్వల్లో వాయు వేగం, ఏమైంది ఇంత కాలం
ఇంత మంది బౄందగానం, ఈవాళే పంపెనేమో ఆహ్వానం -- "2"
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతి జల్లుగా సరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోదా హోరెత్తిపోతున్న గానా బజానా
చెంగుమంటు ఆడెనా చిత్రంగా జావళీలు పాడేనా
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా

Naa Autograph - మౌనంగానే ఎదగమనీ

మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుందీ
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్థమందులో ఉంది -- "2"
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తోంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తోంది ----- "మౌనం"

దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
ధరికి చేర్చు దారులు కూడ ఉన్నాయిగా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధవెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగర మధనం మొదలవ్వగానే విషమే వచ్చిందీ
విసుగే చెందక కౄషి చేస్తేనే అమౄతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లొ ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి ధాటిన వాళ్ళకు సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ
తలచకుంటె సాధ్యమిదీ --- "మౌనం"

చెమటనీరు చిందగా నుదుట రాత మార్చుకో
మార్చలేనిదేది లేదనీ గుర్తుంచుకో
పిడికేలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగ నీ తల రాతను నువ్వే రాయాలి

నీ ధైర్యాన్ని ధర్షించి దైవాలె తలదించగా
నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలె తరయించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి ---- "మౌనం"

త్రిశూలం - రాయిని ఆడది చేసిన రాముడివా

రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
గంగను తలపై మోసే శివుడివా ఆ

రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
గంగను తలపై మోసే శివుడివా ఆ

ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను

నువు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను

నువు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను

తోడనుకో నీవాడనుకో
తోడనుకో నీవాడనుకో

నేనేంటి, నాకింతటి విలువేంటి
నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి

నీకేంటి, నువు చేసిన తప్పేంటి
ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా

తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా
నిప్పులాంటి సీతనైనా తప్పు చెప్పకుందా

అది కథే కదా
మన కథ నిజం కాదా

అది కథే కదా
మన కథ నిజం కాదా

రాయిని ఆడది చేసిన రాముడివా ఆ
గంగను తలపై మోసే శివుడివా ఆ

ఏమనుకోను నిన్నేమనుకోను
ఏమనుకోను నిన్నేమనుకోను

తోడనుకో నీవాడనుకో

ఈ ఇల్లు, తోడొచ్చిన నీ కాళ్లు
నాకెన్నో జన్మలకు కోవెల్లు
కోవెల్లు, కోవెలలో దివ్వెల్లు
కన్నీల్లతో వెలిగించే హృదయాలు   

హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు
హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు
ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు

అది నువ్వే కదా
నేనూ నువ్వే కదా
అది నువ్వే కదా
నేనూ నువ్వే కదా

నువు రాయివి కావు, గంగవు కావు
నే రాముడు శివుడు కానే కాను

ప్రేమికుడు - ఓ చెలియా నా ప్రియ సఖియా

ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచినదే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే

ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే

ఈ పూట చెలి నా మాటా ఇక కరువైపోయెనులే
అదరము ఉదరము నడుమన ఏదో అలజడి రేగెనులే
ఈక్షణలో నీరిక్షణలో ఒక క్షణమొక యుగమేలే
సూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే
ఇది స్వర్గమా నరకమా ఎమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే

ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే

కోకిలమ్మ నువు సై అంటె నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెటికలు విరిచేనే
ఈ చేతి చలి గాలులకు తెర చాపై నిలిచేనే
నా ఆశల ఊసులే చేవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితను అంటానే

ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచినదే
నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సొలెనులే

ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే

కొండవీటి దొంగ  - శుభలేఖా రాసుకున్న

శుభలేఖా రాసుకున్న ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖా అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సందెలు రంగరిస్తా కన్నులలో

శుభలేఖా రాసుకున్న ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో

చైత్రమాసమచ్చెనేమో  చిత్రమైన ప్రేమకీ
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చు కొమ్మకీ
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకీ
మల్లెమబ్బులాడెనేమో మాల నీలవేణికి

మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు
గుచ్చు గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలె కథంతేలే అదంతేలే


శుభలేఖా అందుకున్నా కలయో నిజమో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో

శుభలేఖా అందుకున్నా కలయో నిజమో
శుభలేఖా రాసుకున్న ఎదలో ఎపుడో

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వెసవల్లె వేచివున్నా రేగుపూల తోటలో
వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
ఒళ్ళుదాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు

అంతేలె కథంతేలే అదంతేలే

శుభలేఖా రాసుకున్న ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్న అపుడే కలలో

శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సందెలు రంగరిస్తా కన్నులలో

శుభలేఖా రాసుకున్న ఎదలో ఎపుడో
శుభలేఖా అందుకున్నా కలయో నిజమో

ఖైదీ నం.786 - మల్లి మల్లి

మల్లి మల్లి, ఇది రాని రోజు
మల్లెజాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటె నాకు వెన్నెలేదీ
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమికానూ

మల్లి మల్లి, ఇది రాని రోజు
మల్లెజాజి అల్లుకున్న రోజు

చేరువైన రాయబరాలే, చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ధ్యానాలే, పాడలేని భావగీతం
ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దాం, ఒక్కరం ఇద్దరం అవుతున్నం
వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేదీ
గున్నమామి విరబూస్తున్నా, తోటమాలి జాడేదీ
నా ఎదే తుమ్మెదై, సన్నిధే చేరగా

మల్లి మల్లి, ఇది రాని రోజు
మల్లెజాజి అల్లుకున్న రోజు

కళ్లనిండ నీలి స్వప్నాలే, మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే, నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లో ఏ మొగ్గే పూయనీ, రాగాలే బుగ్గల్లో దాగనీ
గులాబీలు పూయిస్తున్న తేనెటీగ అథితేదీ
సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేదీ
రేగులో నావలా, నీ జతే కోరగా

జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటె నాకు వెన్నెలేదీ
ఏదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటంలో
వెళ్ళలేను ఉండలేను ఏమికానూ

మల్లి మల్లి, ఇది రాని రోజు
మల్లెజాజి అల్లుకున్న రోజు

ల ల ల ల ల ల ల ల ల ల
వుహు వుహు వుహు వుహు వుహు

ఖుషి - ప్రేమంటె సులువు కాదురా

ప్రేమంటె సులువు కాదురా, అది నువూ గెలువలేవురా
ప్రేమించే షరతులేమిటో, అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది, అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనదీ, తాకావ బగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది
సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా

ప్రేమంటె సులువు కాదురా, అది నువూ గెలువలేవురా
ప్రేమించే షరతులేమిటో, అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది, అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనదీ, తాకావ బగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది
సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా

జాబిలినే బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బుల్లో మల్లెల పరుపేస్తావా
ఆకాశం దిండుగ మార్చేస్తావా
తెస్తావా తెస్తావా తెస్తావా

సూర్యున్నే పట్టి తెచ్చెదా
నీ నొదుటన బొట్టు పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా
మెరుపులతో కాటుకెట్టెదా

తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
నాకోసం నయాగర జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరం ఎక్కిస్తావా
పసిఫిక్ సాగరం ఈదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా తెస్తావా

స్వర్గాన్నే సృష్టి చేసెదా
నీ ప్రేమకు కానుకిచ్చెదా
కైలాసం భువికి దించెదా
నా ప్రేమను రుజువు చేసెదా

ప్రేమంటె సులువు కాదురా, అది నువూ గెలువలేవురా
ప్రేమించే షరతులేమిటో, అందులోని మర్మమేమిటొ
ప్రేమెంతో విలువ అయినది, అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనదీ, తాకావ బగ్గుమంటదీ
నో నో నో అలా చెప్పకు, మనసుంటే మార్గముంటది
సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెప్పుతా

తొలిప్రేమ - ఈ మనసే

అలబలబ అలబలబ హెహె "6"
ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే
ఎన్నో కలలను చూసి కన్నే కునుకొదిలేసే
నువ్వే నను వెతికే ఆ తొలి వెలుగని తెలిసే

కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతొ కలవరించెనా
తనకని తిరుగుతూ చెలిజత విడువదు
దొరికిన వరమది కుదురుగ ఉండదు

ఏం చేస్తే బాగుంటుందో చెప్పని వింత నసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

హాలబ హాలబ
అలబా అలబా అలబా అలబా  అలబా అలబా
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే 
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె
నీతో చెలిమిని చేసే నీలో చలువని చూసే 
ఐనా ఇంకా ఏదో అడిగే అత్యాశె

వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నలంటి నీ నవ్వుల్లో చెమ్మగిల్లినా
తహ తహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

పరిగెడుతోంది నీకేసి, వినమంటొందీ తన ఊసే
అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే

ఈ మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్
నా మనసే సెయ్ సెయ్ సెయ్ సెయ్

శశిరేఖా పరిణయం - ఏదో ఏదో

ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఈ వైనం
కలతపడుతోందే లోలోన
కసురుకుంటొందే నా పైన
తన గుబులు నేను నా దిగులు తాను
కొంచెమైనా పంచుకొంటె
తీరిపోతుందేమో ఆ భారం

ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పలేనంది ఈ వైనం

పచ్చగా ఉన్న పూదోట నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

పచ్చగా ఉన్న పూదోట నచ్చడంలేదే ఈ పూట
మెచ్చుకుంటున్నా ఊరంతా గిచ్చినట్టుందే నన్నంతా

ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా
ఉండలేను నెమ్మదిగా ఎందుకంట తెలియదుగా

తప్పటడుగో తప్పు అనుకో తప్పదే తప్పకపోదా
తక్షణం అంటూ పట్టుపడుతోందే ఆరాటం
పదమంటూ నెట్టుకెడుతోందే నను సైతం

శశిరేఖా పరిణయం - నిన్నే నిన్నే

నిన్నే నిన్నే అల్లుకొని, కుసుమించే గంధం, నేనవనీ
నన్నే నీలొ కలుపుకొని, కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతీ పూట పూవై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా
నూరెళ్ళు నన్ను నీ నీడే ననవనీ 

నిన్నే నిన్నే అల్లుకొని, కుసుమించే గంధం, నేనవనీ

వెన్నుతట్టి మేలుకొలిపినా వేకువ నువే
కన్నె ఈడు మేను మరచిన వేలవు నువే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువే
తాళి కట్టి ఏలవలిసిన దొరవూ నువే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మదిని వేదించే శ్యామసుందరా
మనసిచ్చిన నిచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని, కుసుమించే గంధం, నేనవనీ

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలాసమా
కొంగు ముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంతా వెలిగించి హారతీయనా

నిన్నే నిన్నే నిన్నే
ఆ ఆ ఆ
నిన్నే నిన్నే నిన్నే

కొత్త బంగారు లోకం - నేనని నీవని  వేరుగా లేమని

నేనని నీవని, వేరుగా లేమని చెప్పినా వినరే ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎపుడైనా
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం, తెలిస్తే
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే

స స సరి స స సరి  స స సరి

మొదటిసారి  మదినిచేరి నిదరలేపిన ఉదయమా 
వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా
మరే కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయె నా

"నేనని నీవని -> లోకం పిలిస్తే "

సలిలో సలిళొ సలిళొ సలిళొ సలి "4"

పదము నాది, పరుగు నీది ప్రథమువైరా ప్రియతమా
తగవు నాది, తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా
నువే దారిగా నెనే చేరగా
ఏటూ చూడక వెనువెంటే రానా

"నేనని నీవని -> లోకం పిలిస్తే "

సలిలో సలిళొ సలిళొ సలిళొ సలి "4"

నేనున్నాను - ఏ శ్వాసలో చేరితో

వేణుమాధవా ఆ ఆ ఆ ఆ "2"
ఏ శ్వాసలో చేరితే, గాలి గాంధర్వమౌతున్నదో "2"
ఏ మోవిపై వాలితే, మౌనమే మంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో, నే లీనమై, ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా ఆ

ఏ శ్వాసలో చేరితే, గాలి గాంధర్వమౌతున్నదో

మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువును నిలువున తొలిచిన గాయములే
తన జన్మకీ, తరగని వరముల సిరులని తలచిందా
కౄష్ణా   నిన్ను చేరింది, అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి, ఎదురు తాను పొందగలిగింది
వేణుమాధవా నీ సన్నిధీ

ఏ శ్వాసలో చేరితే, గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే, మౌనమే మంత్రమౌతున్నదో

చల్లని నీ చిరునవ్వులు కనపడకా కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడకా, హౄదయానికీ
అలజడితో అణువణువూ తడబడదా

ఆ ఆ ఆ ఆ "2"

నువే నడుపు పాదమిది, నువే మీటు నాదమిది
నివాళిగ నా మది నివెదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధీ

రాధికా హౄదయ రాగాంజలి
నీ పాదముల వ్రాలు కుసుమంజాలి
ఈ గీతాంజలి

మురారి - అలనాటి రామచంద్రుడికన్నింటా సాటి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామచంద్రుడి కన్నింటా సాటి
ఆ పలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి

అనిపించే అరుదైన  అబ్బాయికి మనువండీ

తెలుగింటి  పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి  దీపమల్లె కనిపించిన జాన
తెలుగింటి  పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి  దీపమల్లె కనిపించిన జాన

అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెల వెల బోవమ్మా

పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్లు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు 

నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపులు ముద్దగ తడిపిన తుంతరి జలకాలు

అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన

కలలకు దొరకని కలగల కంటని పదిమంది చూడండి
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చికలేయండి

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెల వెల బోవమ్మా

సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్న
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మంటపాన
గౌరిశంకరులేకమైన ముహూర్తమల్లే ఉన్న
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయాన

దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకోని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగగా బంధువలంతా కదలండీ

చందమామ చందమామ కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగాలేవని వెల వెల బోవమ్మా
ఘర్షణ - ఏ చిలిపి కళ్లలోన కలవో

కిసి ఆషికా క ఖయాల్ హై
దరియా కా లెహ్రా చాల్ హై
ఎక్ ప్యార సా సవాల్ హై
యేతో బస్తీ కమాల్ హై
హై హై హై హై

బీగి బీగి సి యేరాత్ హై
యేతో ప్యార్ కా యేరంగ్ హై
బీగి బీగి సి యేరాత్ హై
యేతో ప్యార్ కా యేరంగ్ హై

యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

నువు హచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
నువు హచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచుపూల జల్లువో

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

యే రంగ్ హై తారంగ్ హై
యే రంగ్ హై తారంగ్ హై

బీగి బీగి సి యేరాత్ హై
యేతో ప్యార్ కా యేరంగ్ హై

ఈ పరిమళము నీదేనా
నాలో పరవశము నిజమేనా
గొండుమల్లి పూవుకన్నా
తేలికగు నీ సోకు
రెండు కళ్లు మూసుకున్నా
లాగు మరి నీ వైపూ
సొగసులు చూసి పాడగా ఇలా
కనులకు మాట రాదుగా అలా
వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగానూ నువ్వే

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

ఆ పరుగులలో పరవళ్లు
తూలే కులుకులలో కొడవళ్లు
నిన్నూ చూసి వంగుతుందీ
ఆశపడి ఆకాశం
ఆ మబ్బుచీర పంపుతుందీ
మోజుపడి నీకోసం

స్వరముల తీపికోయిలా ఇలా ఇలా
పరుగులు తీయకే అలా అలా

నవ్వుతున్నా నిన్నూ చూసి సంతోషం
నీ బుగ్గ  సొట్టలోన పాడే సంగీతం

ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్లలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో

నువు హచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
నువు హచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచుపూల జల్లువో

little soldiers - సరేలే ఊరుకో పరేషానెందుకు

సరేలే ఊరుకో పరేషానెందుకు
సరేలే ఊరుకో పరేషానెందుకు
చలేసె ఊరిలో జనాలే ఉండరా
ఏడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్తా మారిపోతే మూతి మూడ్చుకుంటారా
ఆటలోను పాటలోను మూడు మళ్ళి మార్చుకోరా
మెరా నాం జోకరు, మెరా కాం నౌకరు
హిరోలా చేతిలో అలాడిన్ లాంతరు
ఎని తింగ్ కోరుకో క్షణంలో హాజరూ
ఖరీదేం లేదు కాని ఊరికేలె ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

పిల్లి పిల్లలెప్పుడూ ఒకే మాట కదా
మియా మియా మియా మియా
కొడిపెట్టకెప్పుడూ ఒకే కూత కదా
కొక్కో కొక్కరకో కొక్కో కొక్కరకో
కోకిలమ్మ ఆకలైనా ట్యూన్ మాత్రం మార్చదే
రామచిలుక రాతిరైనా కీచురాయై కూయదే
అలాగే నీ పెదాల్లో నవ్వు మాత్రం మారనీయకె బుల్లమ్మా
కష్టమస్తే కేరు చేయక నవ్వుతో తరిమేయవమ్మా

మెరా నాం జోకరు, మెరా కాం నౌకరు
హిరోలా చేతిలో అలాడిన్ లాంతరు
ఎని తింగ్ కోరుకో క్షణంలో హాజరూ
ఖరీదేం లేదు కాని ఊరికేలె ఊపురాదే ఓ మైనా
క్లాప్స్ కొట్టి ఈలలేస్తే చూపుతానె నా నమూనా

గోటి బిల్ళలాడుదాము సిక్సరు కొడదాము
క్రికెట్ కాదుగాని ఫన్నిగానె వుంది
ఏటిలోన దిగుదాము ఈతలు కొడదాము
బఫెల్లొస్ కది బాత్రూం కాద మరి
రాణిగారి పోసులోన నువు కుర్చొమా టీవిగా
గేదా గారి వీపు మీద సైడుకెలదాం స్టైలుగా
జురాసిక్ పార్క్ కన్నా బెస్టు ప్లేసు బుల్లమ్మా
బోలెడన్ని వింతలున్నాయి బోరులేక చూడవమ్మ

మహారాజు - కైలాస శిఖరాన కొలువైన స్వామి

కైలాస శిఖరాన కొలువైన స్వామి
నీ కంట పొంగేనా గంగమ్మ తల్లీ
మనసున్న మంచోల్లె మారాజులు
మమతంటు లేనోల్లె నిరుపేదలు
ప్రేమే నీ రూపం, త్యాగం నీ ధర్మం
ఎవరేమి అనుకుంటే నీకేమిలే
రాజువయ్యా, మహరాజువయ్యా "2"

కన్నీట తడిసినా కాలాలు మారవు
మనసారా నవ్వుకో పసిపాపల్లే
ప్రేమకన్నా నిధులు లేవు
నీకన్న ఎవరయ్యా మారాజులు
నిన్నేవరూ ఎమన్నా నీ దాసులు
జరిగినవి జరిగేవి కలలే అనుకో "2"

రాజువయ్యా, మహరాజువయ్యా "2"

త్యాగాల జీవితం, తనవారికంకితం
మిగిలింది నీ నేను, నా నువ్వేలే
దేవుండంటి భర్త వుంటే
నాకన్నా ఎవరయ్యా మారాణులు
మనకున్నా బంధాలే మాగాణులు
ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు "2"

రాజువయ్యా, మహరాజువయ్యా "2"